Breaking News

ఖమ్మంలో విచిత్ర ఘటన.. రెండేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ‍ప్రత్యక్షం..

Published on Fri, 07/21/2023 - 21:06

సాక్షి, ఖమ్మం జిల్లా: రెండేళ్ల క్రితం అదృశ్యమైన తల్లి చనిపోయిందనుకొని  కర్మకాండలు పూర్తి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. తిరిగి ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ విచిత్ర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ-తిరపతయ్య దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుండి అదృశ్యమైంది.

ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పత్రికల్లోనూ, టీవీలోనూ ఆమె ఆచూకీ కోసం వెతక సాగారు. ఆమె వివరాల కోసం వెతికే సమయంలో సమీప ప్రాంతంలో కొండమీద ఒక మహిళను హత్య చేసిన సంఘటన జరిగింది. హత్యగావించబడ్డ మహిళ ఆధారాలు లభించకపోవడంతో మతిస్థిమితం లేక తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా భావించి ఆమె కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేసి గత్యంతరం లేని పరిస్థితిలో కర్మకాండలు కూడా పూర్తి చేశారు.

తిరిగి రెండు సంవత్సరాల తర్వాత ఆమె కుమారుడు సోషల్ మీడియాలో కన్న తల్లిని గుర్తించిన కుమారుడు కుటుంబ సభ్యులకు  వివరాలు తెలియజేశాడు. ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే ఫౌండేషన్ అనాథా శ్రమంలో ఉన్నట్టు ఆ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా గుర్తుపట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు నాగేంద్రమ్మను అనాథాశ్రమంలో  కలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మధిర పోలీసులను సంప్రదించారు. సరైన ఆధారాలు ఉండటంతో మహిళను వారి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)