Breaking News

లొంగిపోయిన నా కొడుకు ఎక్కడ?

Published on Tue, 11/25/2025 - 07:11

వరంగల్‌: మావోయిస్టుల్లో చేరిన తన కొడు­కు లొంగిపోయా­డని ఈనెల 4వ తేదీన పోలీసులు చెప్పి 20 రోజులు దాటినా ఆచూకీ లేద­ని వరంగల్‌ నగరం లేబర్‌ కాలనీకి చెందిన పోలేపాక సులోచన తెలిపింది. ఆమె సోమ­వారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఐదుగురు సంతానమని, అందులో నాలుగో కొడుకు పోలేపాక సునీల్‌ 27 ఏళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడని పేర్కొంది. కొన్ని నెలల తర్వాత పోలీసులు వచ్చి తన కొడుకు అడవి బాట పట్టి మావోయిస్టుల్లో చేరాడని చెప్పడంతో భయపడిపోయామని చెప్పింది. 

తరచూ తమ ఇంటికి పోలీసులు వచి్చపోతూ బిడ్డ వస్తున్నాడా...లేదా అంటూ విచారించేవారని పేర్కొంది. భర్త చనిపోయినప్పుడు కూడా కొడుకు రాలేదని, ఈనెల 4న వరంగల్‌ నుంచి ఒకరు, హైదరాబాద్‌ నుంచి మరొకరు వచ్చి.. సునీల్‌ లొంగిపోయాడని సమాచారం అందించినట్లు తెలిపింది. లొంగిపోయాడని చెప్పడంతో ఎంతో సంతోíÙంచానని, వృద్ధాప్యంలో ఉన్న తనకు కొడుకు ఆసరాగా ఉంటాడని ఆశపడ్డానని పేర్కొంది. కానీ, 20 రోజులు దాటినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనగా ఉందని తెలిపింది. తన కొడుకు విషయమై ఎవరిని సంప్రదించాలో తెలియదని, ఎక్కడున్నాడో పోలీసులు చెప్పాలని ఆమె కన్నీటిపర్యంతమైంది.  

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)