Breaking News

కూల్‌ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి..

Published on Mon, 04/21/2025 - 11:58

నిజాంపేట్‌(మేడ్చల్ జిల్లా): కుటుంబ కలహాలా! లేక అనారోగ్యమో తెలియదుకాని.. ఆ ఇల్లాలు తనువు చాలించాలనుకుంది. తనతో పాటు తన నాలుగేళ్ల కూతురును సైతం తీసుకెళ్లాలని.. కూల్‌ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాను తాగి, కూతురుకు కూడా తాగించింది. దీంతో కూతురు మృతి చెందగా తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలిలా ఉన్నాయి.. నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, హరితా ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లో నంబూరి సాంబశివరావు, కృష్ణా పావని దంపతులు నివాసం ఉంటున్నారు.

 వీరికి నాలుగేళ్ల కూతురు జెశి్వక ఉంది. సాంబశివరావు ఐటీ ఉద్యోగికాగా, పావని గృహిణి. ఈ నెల 18న శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పావని కూల్‌ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగింది. కూతురు జెశి్వకకు కూడా తాగించింది. దీంతో ఆరోజు రాత్రి ఇద్దరూ పలు మార్లు వాంతులు చేసుకున్నారు. రాత్రి ఇంటికి వచి్చన భర్తకు పావని ఈ విషయం చెప్పలేదు. శనివారం ఉదయం కూడా వాంతులు అవుతుండటంతో పావని భర్తకు ఈ విషయం చెప్పింది. దీంతో సాంబశివరావు వెంటనే వారిని కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. జెశి్వక పరిస్థితి విషమించడంతో రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. 

అయితే పరిస్థితి మరింత విషమించడంతో సాయంత్రం జెశ్విక మృతి చెందింది. పావని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సాంబశివరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పావని తన కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం పావని గత కొద్ది సంవత్సరాలుగా మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)