Breaking News

నాడు తల్లి.. నేడు కూతురు

Published on Sat, 11/01/2025 - 07:41

జగిత్యాలక్రైం: నాడు భర్త, అత్త, కుటుంబ సభ్యుల వేధింపులతో తల్లి ఇంట్లో దూలానికి ఉరేసుకోగా, నేడు కూతురు సైతం అదే దూలానికి ఉరేసుకుని ప్రాణాలు వదిలిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్‌ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిని 16 ఏళ్ల క్రితం ఎండపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన వెనంక రవికి ఇచ్చి వివాహం చేశారు. 

వీరికి సహస్ర (16), మణికార్తీక్‌ సంతానం. ఈనేపథ్యంలో భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు జ్యోతిని వేధింపులకు గురిచేయడంతో 2017లో ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో రవి, సవిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈక్రమంలో సహస్త్ర ఎండపల్లి మండలం కుమ్మరిపల్లి కసూ్తరిబాగాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. నెల క్రితం ఆమెకు ముక్కు ఆపరేషన్‌ జరిగింది. వసతి గృహంలో ముక్కు నొప్పి ఎక్కువ కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గతంలో తల్లి ఆత్మహత్య చేసుకున్న దూలానికే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

 కాగా మృతురాలి అమ్మమ్మ పొరండ్ల సుగుణ తన మనుమరాలి మృతిపై అనుమానాలున్నాయని, తండ్రి రవి, సవతి తల్లి సవిత, వెన్నంకి లక్ష్మి, వెన్నంకి శ్రీనివాస్‌లు కారణమని ఫిర్యాదు చేసింది. వేధింపులు భరించలేకనే కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతుందని, కుటుంబసభ్యులు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్‌ ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు. కాగా, తల్లీకూతుళ్లు ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహస్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆస్పత్రి మార్చురీ గదిలో ఉంచగా, స్నేహితులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)