Breaking News

ఇన్‌స్టా ప్రియుడి కోసం..బిడ్డను బస్‌స్టాండ్‌లో వదిలేసిన తల్లి.. ఆపై

Published on Sun, 07/27/2025 - 19:11

సాక్షి,నల్గొండ: సోషల్‌ మీడియా వినియోగం మంచికి ఉపయోగిస్తే వరం.. అదే చెడుకి ఉపయోగిస్తే శాపం. అలాంటి సోషల్‌ మీడియా అతి వినియోగం కొందరిని పెడదారులు పట్టేలా చేస్తుంటే.. మరికొందరిని భావోద్వేగాలకు గురి చేస్తుంది. నిండు జీవితాల్ని చేజేతులా నాశనం చేసేలా ఉసిగొల్పుతోంది. తాజాగా నల్గొండ బస్టాండ్‌లో జరిగిన సంఘటనలో.. ఓ తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడి మోజులో తన మాతృత్వాన్ని విస్మరించింది. కన్న కొడుకుని బస్టాండ్‌లో వదిలేసింది.అంతటితో ఆగలేదు.. ఇన్‌స్టా ప్రియుడితో కలిసి పరారయ్యింది. ఆ తర్వాత ఏమైందంటే  

జిల్లా పోలీసుల వివరాల మేరకు..ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం అబం శుభం తెలియని పసిపిల్లాడిని బస్టాండ్‌లో వదిలేసి  అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చిందో మహిళ.ఆదివారం తన కొడుకుని తీసుకుని నల్గొండ బస్టాండ్‌కు వచ్చింది. బస్టాండ్‌లోని ఓ ప్రదేశంలోని కూర్చొబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి..అప్పటికే తనకోసం ఎదురు చూస్తున్న ప్రియుడితో కలిసి వెళ్లింది.

అయితే ఇప్పుడే వస్తానన్న అమ్మ రాకపోయే సరికి బాలుడిలో భయం మొదలైంది. అమ్మా.. అమ్మా అని పిలిచినా ఆలకించలేదు. దీంతో ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ సమయంలో ప్రయాణికులు బాలుడిని ఓదార్చి పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండ్‌కు చేరుకున్న పోలీసులు బాలుడిని సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఆచూకీ తెలుసుకుని బాలుడిని తండ్రి చెంతకు చేర్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రియుడితో వెళ్లిపోయి‌న మహిళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)