Breaking News

అలనాటి సీబీఎస్‌ ఆపన్న హస్తం!

Published on Sat, 08/09/2025 - 05:26

సాక్షి, హైదరాబాద్‌:  గౌలిగూడ బస్టాండ్‌గా పేరొందిన సెంట్రల్‌ బస్‌ స్టేషన్‌ ఒకప్పటి హైదరాబాద్‌ తొలి ప్రధాన బస్టాండ్‌. ఎంజీబీఎస్‌కు ముందు దశాబ్దాల పాటు ఇక్కడి నుంచే ఉమ్మడి ఏపీలోని అనేక నగరాలు, పట్టణాలకు సర్విసులు నడిచేవి. భాగ్యనగర చారిత్రక కట్టడాల్లో ఇదీ ఒకటి. తదనంతర కాలంలో మిసిసిపీ హ్యాంగర్‌గా పిలిచే ఈ భారీ ఐరన్‌ ఫ్రాబ్రికేటెడ్‌ నిర్మాణం శిథిలమై, కుప్పకూలి కనుమరుగైంది. కానీ ఆ బస్టాండ్‌ స్థలం ఆర్టీసీకి ఇప్పటికీ సేవలందిస్తూనే ఉంది. ప్రస్తుతం సిటీ సర్విసులు నిలిపే స్థలంగా వినియోగంలో ఉంది. దీని పక్కనే హైదరాబాద్‌–1 డిపో ఉంటుంది.

ఆర్టీసీకి సంబంధించిన కొన్ని ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 5.8 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. అయితే తాజా గా ఈ స్థలాన్ని కొలెటరల్‌ సెక్యూరిటీగా ఉంచిన ఆర్టీసీ హడ్కో నుంచి రూ.400 కోట్ల రుణాన్ని సమకూర్చుకున్నట్టు తెలిసింది. సంస్థలో పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు ఈ నిధులు సేకరించినట్టు సమాచారం. ముఖ్యంగా.. ఆర్టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆర్థిక పరమైన సెటిల్‌మెంట్లు పూర్తి చేయడం, 2017 వేతన సవరణ ప్రయోజనాన్ని కల్పించటం, ఆర్జిత సెలవుల మొత్తాన్ని అందించటం, ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్‌)కు చెందిన వాడేసుకున్న నిధులను తిరిగి జమ చేయటం, పీఎఫ్‌ బకాయిలు చెల్లించటం లాంటి వాటి కోసం ఈ రుణాన్ని తీసుకున్నట్టు తెలిసింది.  

సర్కారు ఆదేశంతో.. : రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో వారు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఇక సీసీఎస్, పీఎఫ్‌లకు సంబంధించి హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సరిగా అమలు చేయకపోవటంతో కోర్టు ధిక్కార కేసులు నమోదు కావటం, పీఎఫ్‌ నుంచి షోకాజ్‌ నోటీసులు రావటం లాంటి వాటి నేపథ్యంలో.. వీటన్నింటినీ చెల్లించటం ఆర్టీసీకి అత్యవసరమైంది. 

గతంలో ఆర్టీసీకి బడ్జెట్‌ కేటాయింపుల్లో కొన్ని గ్రాంట్లు కూడా ఉండేవి. అలాగే మరికొన్ని పూచీకత్తు రుణాలుండేవి. కానీ, ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించటం ద్వారా సంస్థకు ఏర్పడే లోటును ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాల్సి వస్తోంది. దీంతో బడ్జెట్‌ కేటాయింపులను పూర్తిగా దానికే పరిమితం చేసి గ్రాంట్లు, లోన్లను అనధికారికంగా రద్దు చేసింది.

దీంతో సంస్థ అవసరాలకు నిధులు లేకుండా పోయాయి. గతంలో ఏవైనా అవసరాలకు ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు పొందే విధానం ఉండగా, కొంతకాలంగా ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దృష్టిలో ఉంచుకుని పూచీకత్తు ఇవ్వటానికి వెనకాడుతోంది. దీంతో ఆర్టీసీనే సొంతంగా రుణాలు సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఆస్తులను తాకట్టు పెడుతోంది. ఈ క్రమంలోనే గౌలిగూడ పాత బస్టాండు స్థలం ఆర్టీసీకి కీలక మేలు చేసి పెట్టింది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)