Breaking News

అప్పుల లెక్క పెరిగింది!

Published on Mon, 01/06/2025 - 06:11

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన దానికంటే ఈసారి బహిరంగ మార్కెట్‌ రుణా­లు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొన్నదానికంటే 23శాతం అదనంగా అప్పు­లు తీసుకోనుంది. రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ద్వారా రుణ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్‌ను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.40,500 కోట్ల రుణాలను సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్‌బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.

ఇప్పుడు చివరి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు) నెలకు రూ.10వేల కోట్ల చొప్పున మరో రూ.30 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇండెంట్‌ పెట్టింది. అంటే బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకునే రుణం రూ.70,500 కోట్లకు చేరనుంది. రాష్ట్ర సర్కా­రు బడ్జెట్‌లో పేర్కొన్న రుణ సమీకరణ అంచనా రూ.57,112 కోట్లు మాత్రమే. కానీ రుణా­లు అంతకన్నా రూ.13 వేల కోట్లు (23 శాతం) అదనంగా పెరగనున్నాయి. 

ప్రతి నెలా నాలుగు సార్లు..: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు (చివరి త్రైమాసికం) ప్రతి నెలా నాలుగు దఫాల్లో ఆర్బీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐకి ఇచ్చిన ఇండెంట్‌లో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలు కావడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులపై ఆధారపడకుండా బహిరంగ మార్కెట్‌ రుణాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు నెలల కాలంలో రైతు భరోసా, రేషన్‌ కింద సన్న బియ్యం సరఫరా, పింఛన్ల పెంపు వంటి పథకాలను అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో నిధుల అవసరం పెరగనుందని పేర్కొంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్‌ ప్రతిపాదనల కంటే ఎక్కువగా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.40,615 కోట్లు రుణ సేకరణను ప్రతిపాదించగా.. సవరించిన అంచనాల్లో రూ.49,618 కోట్లు చూపారు. అంటే రూ.9వేల కోట్లకుపైనే అదనంగా తీసుకోవడం గమనార్హం.

#

Tags : 1

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)