అండమాన్‌కు చేరిన నైరుతి

Published on Mon, 05/20/2024 - 03:45

సాక్షి, హైదరాబాద్‌/ న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా వర్షాలకు ఆధారమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ఆశావహమైన రీతిలో ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్‌ దీవులు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాల్లో ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ప్రస్తుతం ఇవి చురుకుగా ముందుకు సాగుతున్నాయని.. పరిస్థితి అనుకూలంగా ఉంటే వారం రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మరో వారం, పది రోజుల్లో తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. 

లానినా పరిస్థితుల నేపథ్యంలో.. 
గత 150 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే రుతుపవనాల రాకడ ఒకే విధంగా లేదు. 1918లో చాలా ముందుగానే అంటే మే 11వ తేదీనే నైరుతి కేరళను తాకింది. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్‌ 18వ తేదీన ప్రవేశించాయి. గత ఏడాది జూన్‌ 8న కేరళను తాకాయి.

 అంతకుముందు 2022లో మే 29న, 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ ఒకటో తేదీన నైరుతి ప్రవేశించింది. ఈసారి లానినా పరిస్థితులు ఉండటంతో సాధారణంగా కంటే ఎక్కువే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్టు ఐఎండీ గత నెలలోనే ప్రకటించింది. మన దేశంలో సాగయ్యే పంటల్లో 52 శాతానికిపైగా నైరుతి రుతుపవనాలే ఆధారం. 

మరో రెండు రోజులు వానలు 
ప్రస్తుతం రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం తగ్గిందని.. వచ్చే రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. 

మరోవైపు ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)