Breaking News

కాసులు కురిపించిన మోకిలా.. ప్లాట్లకు మూడు రెట్ల ధర.. గజం రూ.1,05,000 

Published on Tue, 08/08/2023 - 08:18

సాక్షి, హైదరాబాద్‌: మోకిలాలోని హెచ్‌ఎండీఏ ప్లాట్లకు సోమవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. చదరపు గజం అత్యధికంగా రూ.1,05,000, కనిష్టంగా రూ.72,000 చొప్పున ధర పలికింది. సగటున రూ.80,397 చొప్పున ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో విక్రయించినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం 50 ప్లాట్లపైన హెచ్‌ఎండీఏకు రూ.121.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ.25 వేల చొప్పున కనీసధర నిర్ణయించగా, దానికి మూడురెట్లు వేలంలో డిమాండ్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు.

నార్సింగి–శంకర్‌పల్లి మార్గంలో ఉన్న మోకిలాలో భూములు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం విశేషం. హెచ్‌ఎండీఏకు ఇక్కడ 165 ఎకరాల భూమి ఉంది. వీటిలో 15,800 చదరపు గజాల్లో విస్తరించి ఉన్న 50 ప్లాట్లకు సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా అధికారులు వేలం నిర్వహించారు. ఒక్కో ప్లాట్‌ 300 గజాల నుంచి 500 గజాల వరకు ఉంది. ఇటీవల కోకాపేటలో నియోపోలీస్‌ రెండో దశ భూముల తరహాలోనే మోకిలాలోనూ హెచ్‌ఎండీఏ ప్లాట్లకు భారీ డిమాండ్‌ రావడం గమనార్హం. ఈ లే అవుట్‌లో త్వరలో రెండోదశ ప్లాట్లకు కూడా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.  
చదవండి: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)