Breaking News

ఎంఎంటీఎస్‌.. నయాలుక్‌..!

Published on Tue, 06/23/2026 - 11:27

సాక్షి, హైద‌రాబాద్‌: ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు ఆధునిక హంగులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందజేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, బుకింగ్‌ కేంద్రాలు, హైదరాబాద్‌ సంస్కృతిని ప్రతింబించేవిధంగా రూపొందించిన స్టేషన్‌ సమూనాలు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం’లో భాగంగా దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌లో 14 స్టేషన్ల ఆధునికీకరణకు  శ్రీకారం చుట్టింది. బేగంపేట్‌ స్టేషన్‌ పూర్తిస్థాయి సదుపాయాలతో గతేడాది అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్‌ స్టేషన్ల పునరాభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఈ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.  

రూ.2076 కోట్లతో.. 
మొత్తం 14 స్టేషన్‌లకు రూ.2076.42 కోట్లతో పునరాభివృద్ధి పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి  ప్రధాన స్టేషన్లు మినహాయిస్తే మిగతావన్నీ  ఎంఎంటీఎస్‌ స్టేషన్లు. సుమారు రూ.714.73 కోట్లతో చేపట్టిన  సికింద్రాబాద్‌స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ పనులు ఊపందుకున్నాయి.

రూ.29.21 కోట్లతో చేపట్టిన హఫీజ్‌పేట్, రూ.35.61 కోట్లతో చేపట్టిన హైటెక్‌సిటీ స్టేషన్లలో పనులు తుదిదశకు చేరుకొన్నాయి. వీటిని అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో కళాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. అత్యాధునిక టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, సీట్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను  ప్రయాణికులు మెచ్చేలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)