Breaking News

నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు: తీన్మార్‌ మల్లన్న

Published on Sat, 12/06/2025 - 08:42

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారీ అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు మల్లన్నను అడ్డుకున్నారు. ఫిర్జాదిగూడ చెన్నరెడ్డి ఎంక్లవ్‌లో మల్లన్న ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై మల్లన్న ఆగ్రహం​ వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మల్లన్న సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ఇదిలా ఉండగా.. రెండు రోజులు క్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు సాయి ఈశ్వర్ అనే యువకుడు  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సాయి ఈశ్వర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్వేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం, చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ శుక్రవారం తుది శ్వాస విడిచాడు. నేడు సాయి అంత్యక్రియలు జరగనున్నాయి.

 

కాగా, ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్‌కి న్యాయం చేయాలంటూ బీసీ సంఘాలు గాంధీ ఆసుపత్రి వద్ద శుక్రవారం ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీసీ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య అని.. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నతో పాటు శ్రీనివాస్ గౌడ్‌, తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అనంతరం వదిలేశారు. 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)