Breaking News

నాపై కక్ష గట్టారు.. ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

Published on Thu, 08/21/2025 - 11:26

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  బహిరంగ లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో టీబీజీకేఎస్‌ ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధం. రాజకీయ కారణాలతోనే టీబీజీకేఎస్‌ ఎన్నిక. కొందరు నాపై  కుట్రలు చేస్తున్నారు’’ అంటూ కవిత మండిపడ్డారు.

‘‘గతంలో కేసీఆర్‌కు రాసిన లేఖలు లీక్‌ చేసి కుట్రలు చేశారు. పార్టీ వ్యవహారాలను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధిస్తున్నారు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు. ‘‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను.

..ఈ పదేళ్ల కాలంలో టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌‌కు శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్‌‌లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా, ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోంది’’ అంటూ లేఖలో కవిత పేర్కొన్నారు.

కాగా, కవితకు బీఆర్ఎస్ హైకమాండ్‌ షాకిచ్చిన విషయం తెలిసిందే. టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడి పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఆ యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. గురువారం ఉదయం సింగరేణి కార్మికులకు బహిరంగ లేఖ రాశారు.

మరోసారి BRSపై విమర్శలు గుప్పించిన కవిత

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)