Breaking News

టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత వాహనానికి భారీ చలాన్లు

Published on Wed, 07/29/2026 - 08:31

టీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న టీఎస్‌09ఈయూ6666 నంబర్‌ గల కారుపై భారీ స్థాయిలో ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉన్న విషయం “సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఈ వాహనంపై 25 చలాన్లు నమోదై ఉండగా, మొత్తం రూ.21,875 చెల్లించాల్సి ఉంది.

జిల్లాలు దాటినా ఆగని ఉల్లంఘనలు
తెలంగాణ పబ్లికేషన్స్‌ పేరిట రిజిస్టరైన ఈ కారు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రయాణించిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈ చలాన్‌ డేటా స్పష్టం చేస్తోంది. ఓవర్‌ స్పీడింగ్‌: ఎంవీ యాక్ట్‌ సెక్షన్‌ 184 ప్రకారం.. నిర్ణీత వేగ పరిమితి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినందుకు నిజామాబాద్‌ (ఇందల్వాయి), కరీంనగర్‌ (నుస్తులాపూర్‌), సిద్దిపేట, కామారెడ్డి (అడ్లూర్‌), మెదక్‌ (చేగుంట), రామగుండం, హైదరాబాద్‌ (పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే) వంటి ప్రధాన రహదారులపై అత్యధికంగా రూ.1,000 చొప్పున ఫైన్లు విధించారు.

ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్లు: మోటార్‌ వాహనాల నిబంధనలకు విరుద్ధంగా నంబర్‌ ప్లేట్‌ కలిగి ఉన్నందుకు హైదరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలుమార్లు రూ.200 చొప్పున చలాన్లు వేశారు.

అక్రమ పార్కింగ్‌: రహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డంకిగా వాహనాన్ని నిలిపినందుకు సైబరాబాద్‌ (నార్సింగి) పరిధిలోనూ జరిమానా పడింది. సాధారణ వాహనదారులపై నిబంధనల పేరుతో కఠినంగా వ్యవహరించే పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల వాహనాల విషయంలోనూ అదే రీతిలో చలాన్లను వసూలు చేస్తే బాగుంటుందని సామాన్యులు కోరుతున్నారు.  

తంగళ్లపల్లి(సిరిసిల్ల) 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)