Breaking News

తుమ్మిళ్ల లిఫ్టు వద్ద ఉద్రిక్తత

Published on Wed, 08/07/2024 - 06:39

రాజోళి/ శాంతిగనర్‌: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసే క్రమంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌కి చెందిన అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మధ్య వివాదం ఏర్పడి పోటాపోటీగా ఆందోళనకు దిగారు. జిల్లాలోని ఆర్డీఎస్‌ ఆయకట్టుకు నీరందించేందుకు తుంగభద్ర నదిపై నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం నీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉదయం అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు తుమ్మిళ్లకు వెళ్లి మోటార్లు ఆన్‌ చేసి, పూజలు చేసేందుకు డీ–23 కెనాల్‌ వద్దకు వెళ్లారు. అనంతరం ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తుమ్మిళ్ల వద్దకు వచ్చారు.

అయితే తాను మోటార్‌ ఆన్‌ చేసినప్పటికీ కెనాల్‌లో నీరు విడుదల కాలేదని, దీనికి సంపత్‌కుమారే కారణమని ఎమ్మెల్యే విజయుడు ఆరోపించి, ఆందోళన చేస్తూ బైఠాయించారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా తాను ప్రోటోకాల్‌ ప్రకారమే నీటిని విడుదల చేసేందుకు వచ్చానని, తాను ఆన్‌ చేసిన తర్వాత మళ్లీ ఆయన ఏ హోదాలో ఆఫ్‌ చేస్తారని, వెంటనే సంపత్‌ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నీటిని విడుదల చేసేదాకా అక్కడి నుంచి వెళ్లనని తేలి్చచెప్పారు. పోలీసులు ఎంతసర్ది చెప్పినా వినలేదు.

మరోవైపు తుమ్మిళ్ల నుంచి డీ–23కి కాంగ్రెస్‌ కార్యకర్తలతో బయలుదేరిన సంపత్‌ కుమార్‌ను పోలీసులు పచ్చర్లలోనే నిలిపేశారు. దీంతో ఆయన పోలీసులపై మండిపడ్డారు. కాగా.. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు ఎమ్మెల్యే విజయుడిని అరెస్టు చేశారు. కాగా.. తనపై బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదని నిరూపించుకునేందుకు నీటి విడుదల తన ఆధ్వర్యంలోనే చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆర్డీఎస్‌ కెనాల్‌ వద్ద సంపత్‌కుమార్‌ నిరసనకు దిగారు. చివరికి నాటకీయ పరిణామాల మధ్య ఉదయం విడుదల కావాల్సిన నీరు సాయంత్రం 4.15 గంటలకు అధికారులే విడుదల చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)