Breaking News

రాజమౌళి వ్యాఖ్యలపై రాజాసింగ్‌ ఆగ్రహం

Published on Thu, 11/20/2025 - 16:08

హైదరాబాద్‌:  ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజమెత్తారు. రాజమౌళి నిజంగా నాస్తికుడు అయితే డిక్లేర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజమౌళి ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదించారని,  దేవుళ్లు అంటే నమ్మకం లేనప్పుడు ఆ సినిమాలు తీయడం ఎందుకుని రాజాసింగ్‌ ప్రశ్నించారు.  గతంలో దేవుళ్లపై  రాజమౌళి ఇష్టారీతిన కామెంట్స్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వారణాసి సినిమా ప్రమోషన్స్‌ కోసమే ఆలా మాట్లాడారా.. అనే దానిపై క్లారిటీ  ఇచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ధర్మంపై తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపిస్తామని హెచ్చరించారు రాజాసింగ్‌.

కాగా, మహేష్‌ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల కోసం పెద్ద ఎత్తున ఒక ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో   మొదట కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ..  వారణాసి కోసం మహేష్‌ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారని ఆయన అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్‌ ఉన్నాడని విజయేంద్రప్రసాద్‌  చెప్పారు.

అయితే,   వారణాసి గ్లింప్స్ విడియో రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు. 'నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది. ఆయన (హనుమంతుడు) ఉంటే ఇదేనా నడిపించేది..?'  అని అసహనం వ్యక్తం చేశారు.  దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉన్నాయని నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. తాజాగా దీనిపై రాజాసింగ్‌ సైతం స్పందించడంతో  రాజమౌళి వ్యాఖ్యల  ఎపిసోడ్‌ ఎంతవరకూ పోతుందో చూడాలి. 

రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)