Breaking News

ఐపీఎస్‌ అసోసియేషన్‌కు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సవాల్‌

Published on Sat, 01/31/2026 - 14:59

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐపీఎస్‌ అసోసియేషన్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కరీంనగర్ సీపీపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తెలంగాణా ఐపీఎస్ అసోసియేషన్ నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌గా సోషల్ మీడియా వేదికగా కౌశిక్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

‘‘కరీంనగర్‌ సీపీపై మత మార్పిడి ఆరోపణలు నేను చేయలేదు. నేను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ప్రివిలేజ్‌ మోషన్‌ వేస్తా’’ అంటూ కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.

కాగా, పాడి కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌ సీపీ గౌస్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. సీపీ గౌస్‌ మత మార్పిడులపై పాల్పడుతున్నారంటూ కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారంటూ ఐపీఎస్‌ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

గురువారం కరీంనగర్‌ జిల్లాలోని వీణవంక స్థానిక సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్తున్న పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్‌ రెడ్డి హుజూరాబాద్‌ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో కరీంనగర్‌ సీపీ గురించి కౌశిక్‌రెడ్డి మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఐపీఎస్‌ అధికారుల సంఘం మండిపడింది. క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.

 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)