Breaking News

కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ

Published on Sun, 06/01/2025 - 09:56

సాక్షి, హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కేసు (ఓఎంసీ)లో ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి దోషిగా తేలిన తర్వాత ఆయనకు జైల్లో ఏమీ ప్రత్యేకతలు ఉండవని, ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కౌంటర్‌ దాఖలు చేసింది. ట్రయల్‌ కోర్టు విధించిన శిక్ష అమలును నిలిపివేయాల్సిన అవసరం లేదని చెప్పింది. శిక్షను నిలిపివేయకపోతే తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి ఎలాంటి నష్టం వస్తుందో గాలి జనార్దన్‌రెడ్డి స్పష్టంగా వివరించలేదని చెప్పింది. 

ఓఎంసీ కేసులో దోషులుగా తేలడంతో గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌లకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు మే 6న ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు తీర్పు చట్టవిరుద్ధమని, దానిని కొట్టివేయాలని కోరారు. అలాగే తమకు బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ పిటిషన్‌పై మేనెల 21న విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ తాజాగా కౌంటర్‌ దాఖలు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని పేర్కొంది. ఎమ్మెల్యేగా కొనసాగడం ప్రాథమిక హక్కు కాదని.. గాలి పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పింది. ఈ పిటిషన్‌పై బుధవారం మరోసారి విచారణ జరిగే అవకాశం ఉంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)