Breaking News

స్కూల్‌ బస్సును ఢీకొన్న కారు.. ఎమ్మెల్యే భార్య, విద్యార్థులకు గాయాలు

Published on Wed, 08/09/2023 - 21:03

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్‌ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. 

వివరాల ప్రకారం.. నర్సంపేటలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కమలాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ధ్వంసం కాగా.. ఆమె కూడా గాయపడ్డారు. అయితే కారులో ఉండే బెలున్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో వెంటనే స్వప్నను వరంగల్‌ ఆసుపత్రికి తరలించగా.. విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. 

ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో విద్యార్థులు గాయపడటంతో స్థానికులతో పాటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భార్యను పోలీసులు సేవ్ చేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యుల కోసమే ఉన్నారా అని పోలీసులను పేరెంట్స్ నిలదీశారు. ఎమ్మెల్యే వాహనం అతివేగంతో వెళ్ళిన విజువల్స్ అక్కడున్న సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ఇది కూడా చదవండి: కేబుల్‌ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)