Breaking News

మహిళ కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఇద్దరి అరెస్ట్‌

Published on Tue, 02/25/2025 - 10:49

మియాపూర్‌:  రోడ్డుపై నిలబడి ఉన్న మతిస్థిమితం లేని మహిళను బలవంతంగా స్కూటీపై ఎక్కించుకొని కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం మియాపూర్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు ఆ కేసు వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా ఆమీన్‌పూర్‌ బద్దంకొమ్ములోని మారుతీ హిల్స్‌ కాలనీకి చెందిన బాలకుమార్‌ అలియాస్‌ శివకుమార్‌(25) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

అతని స్నేహితుడైన మెదక్‌ జిల్లా దుర్గాగుడి పెద్దపూర్‌కు చెందిన గౌరగల్ల మహేష్‌ (24)తో కలిసి 21వ తేదీన బ్లూ కలర్‌ స్కూటీపై ఇద్దరూ మియాపూర్‌ బొల్లారం క్రాస్‌ రోడ్డు నుంచి బొల్లారం వైపు వెళుతున్నారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో మియాపూర్‌ క్రాస్‌ రోడ్డు బస్టాప్‌ వద్ద ఓ మహిళ(36) ఒంటరిగా కనిపించడంతో బలవంతంగా స్కూటీపై ఎక్కించుకొని వెళ్లారు. ఐలాపూర్‌ తండా సమీపంలో ఎవరూ లేని ప్రాంతం చూసి ఆ ఇద్దరు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఆమెను వదిలేసి పరారయ్యారు. మహిళపై అత్యాచారం చేసినట్టు పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. 

ఓ కారు డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు  కేసు విచారణ భాగంగా మియాపూర్‌లో తనిఖీలు చేస్తుండగా బాలకుమార్, మహే‹Ùలను అనుమానించి  అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్టు అంగీకరించారు. నిందితుల్లో బాలకుమార్‌పై చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్నాచింగ్, రాబరీ, ఇళ్లల్లో దొంగతనాలు, భూ తగాదాలు వంటివి 8 కేసులు ఉన్నాయి. మహే‹Ùపై ఓ మర్డర్, దొంగతనం కేసులు అల్లాదుర్గం పీఎస్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరిని  అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో సీఐ క్రాంతి కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా


 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)