Breaking News

ఓరుగల్లుకు ప్రపంచ సుందరీమణులు

Published on Wed, 05/14/2025 - 03:52

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: చారిత్రక నగరం ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణులు బుధవారం పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్‌ నగరంలో నాలుగున్నర గంటలు గడపనున్నారు.  రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్‌ కోటను వారు సందర్శించనున్నారు. 

హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 4:35 గంటలకు 22 మంది బృందం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 5:45 గంటలకు చారిత్రక వేయి స్తంభాల దేవాలయానికి చేరుకుని అక్కడి కార్యక్రమాల అనంతరం 6:40 గంటలకు వరంగల్‌ కోటకు చేరుకొని శిల్పాలను సందర్శించి వాటి విశిష్టతలను తెలుసుకుంటారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. 

రామప్పకు మరో బృందం: 35 మంది సుందరీమణుల మరో బృందం సాయంత్రం 5:15 గంటలకు ములుగు జిల్లా రామప్పకు చేరుకుని అక్కడి హరిత హోటల్‌లో కొద్దిసేపు సేదదీరి సంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాశస్త్యం, కాకతీయుల చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు. 

హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌లు ప్రావీణ్య, సత్యశారద, సన్‌ప్రీత్‌సింగ్‌లు, వివిధ శాఖల అధికారులు వారం రోజులుగా సమీక్ష లు, ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ములుగు కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, ఎస్పీ శబరీష్‌లు రామప్పలో ఏర్పాట్లు పరిశీలించారు. సుమారు మూడు వేల మంది పోలీసులు మూడంచెల బందోబస్తులో పాల్గొంటున్నారు.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)