జుగల్‌బందీ సూపర్‌ హిట్‌

Published on Mon, 05/12/2025 - 02:04

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి పోటీల ప్రారంభోత్సవంలో ఈసారి మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చేసిన కొత్త ప్రయోగం బాగా ఆకట్టుకుంది. వాస్తవానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ ఈ ప్రతిపాదన చేసింది. దీనిపై తొలుత కాస్త విముఖత ప్రదర్శించిన మిస్‌ వరల్డ్‌ సంస్థ తర్వాత ఆమోదించింది. చివరకది మిస్‌ వరల్డ్‌ బృందాన్నే బాగా ఆకట్టుకోవడంతో పాటు అనూహ్య స్పందన లభించింది. ఏ నగరంలో జరిగినా.. మిస్‌ వరల్డ్‌ పోటీల ప్రారంభోత్సవంలో స్థానిక సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటం సహజం.

ఇదే తరహాలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రారంభోత్సవంలో 250 మంది కళాకారులతో తెలంగాణ సంప్రదాయ పేరిణి నృత్య విన్యాసాన్ని ప్రదర్శించారు. ఇంతవరకు ఎప్పుడూ జరిగే తంతే. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత, మిస్‌ వరల్డ్‌ పోటీదారులను వేదిక మీదకు ఆహ్వానించి పరిచయం చేస్తారు. కానీ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పరిచయ భాగాన్ని ఒకింత కొత్తగా డిజైన్‌ చేశారు. 

పోటీదారులను ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించి, ఒక్కో బృందం పరిచయానికి పైలట్‌ తరహాలో ఒక్కో సంప్రదాయ నృత్యరీతిని ప్రదర్శించేలా రూపకల్పన చేశారు. గుస్సాడీ, ఒగ్గు డోలు, లంబాడీ, కొమ్ము కోయ నృత్య కళాకారులను నాలుగు బృందాలుగా చేసి, ఒక్కో ఖండం పోటీదారులను కళాకారులు తమ విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ఆహ్వానించే తరహాలో రూపొందించారు. దీనికి పాశ్చాత్య సంగీతాన్ని కూడా జోడించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వీక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

అందాల పోటీకి తగ్గట్టుగా ప్రత్యేకంగా పేరిణి గీతం 
250 మంది కళాకారులతో సంప్రదాయ పేరిణి నృత్యం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు వినియోగించిన గీతాన్ని అందాల పోటీలను దృష్టిలో ఉంచుకుని రాయించటం విశేషం. ‘అతివల హంస నడకలతో అందమే సాగెనే..లలిత శృతుల గతుల లయల హొయల..అరవిరిసిన కన్నులకు అభినయాల వందనం.. అతి కోమల అధరాలకు అతి సుందర వందనం.. మనసెరిగిన మగువలకు మయూరాల వందనం..’అంటూ సాగిన గీతానికి తగ్గట్టుగా కళాకారులు నర్తించి ఆకట్టుకున్నారు. ఈ విధంగా సంప్రదాయ నృత్యాలతో పోటీదారులను స్వాగతించి పరిచయం చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామని, పేరిణి సందీప్, ఫణి నారాయణ, శ్రీరాంభట్ల ఆదిత్య శర్మలు శ్లోకంతో కూడిన గీతాలను రచించారని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)