Breaking News

‘మిస్‌ యూనివర్స్‌ స్టేట్‌’ గ్రాండ్‌ ఫినాలే 2024 

Published on Mon, 07/22/2024 - 07:05

సాక్షి, హైదరాబా: నగరం పై కురుస్తున్న తొలకరి చిరుజల్లులు ఓ వైపు... నగరం వేదికగా నిర్వహించిన మిస్‌ యూనివర్స్‌ స్టేట్‌ గ్రాండ్‌ ఫినాలే ర్యాంప్‌ పై నడుస్తున్న టాప్‌ మోడల్స్‌ సోయగాలు మరో వైపు. వెరసి ఆదివారం నగరం అందాల సోయగాలతో పులకించిపోయింది. శ్రీనగర్‌ కాలనీలోని విన్‌ఫ్లోరాలో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక స్టేట్‌ మొదటి ఎడిషన్‌ గ్రాండ్‌ ఫినాలేలో 3 రాష్ట్రాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు క్యాట్‌వాక్‌తో అలరించి విజేతలుగా నిలిచారు. 

ఇందులో భాగంగా మిస్‌ యూనివర్స్‌ తెలంగాణగా నిహారిక సూద్, మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ చందన జయరామ్, మిస్‌ యూనివర్స్‌ కర్ణాటకగా అవనీ కాకేకోచి టైటిల్‌ క్రౌన్‌ గెలుచుకున్నారు. ర్యాంప్‌ పై వాక్‌ చేసిన అందాల తారలను బ్యూటీ, ఫ్యాషన్‌ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విజేతలుగా ఎంపిక చేశారు. ఈ ఫ్యాషన్‌ జ్యూరీలో మిస్‌ యూనివర్స్‌ స్టేట్‌ డైరెక్టర్‌ ప్రాచీ నాగ్‌పాల్, మిస్టర్‌ గ్లోబల్‌ 2023 జాసన్‌ డైలాన్, సెలబ్రిటీ డెంటిస్ట్‌ డాక్టర్‌ నిదా ఖతీబ్, ఫ్యాషన్‌ డిజైనర్‌ అంజలి ఝా, ఫౌండర్‌ చుర్రోల్టో నీహర్‌ బిసాబతేని పాల్గొన్నారు. మిస్‌ యూనివర్స్‌ స్టేట్‌ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి 96 మంది పాల్గొనగా..వీరిలో ఒక్కో రాష్ట్రం నుంచి 7 మంది చొప్పున 21 మందిని ఫైనలిస్టులుగా ఎంపికచేశారు. 

21 మందిలో ఒక్కో రాష్ట్రం   నుంచి మిస్‌ యూనివర్స్‌ స్టేట్‌ విన్నర్‌తో పాటు, ఇద్దరు రన్నరప్‌లను ఈ గ్రాండ్‌ ఫినాలే విజేతలుగా ప్రకటించింది. బెస్ట్‌ స్మైల్, బెస్ట్‌ అటైర్‌ టైటిల్స్‌ ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ ఫినాలేలో యువతులు, కార్పొరేట్‌ ఉద్యోగులు, ఫ్యాషన్‌ మోడల్స్‌ సందడి చేశారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)