Breaking News

మిస్‌ ‘కళలు’.. అదుర్స్‌

Published on Fri, 05/23/2025 - 05:18

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గురువారం రాత్రి నిర్వహించిన ‘టాలెంట్‌ గ్రాండ్‌ ఫినాలే విభిన్న కళలతో అలరించింది. 24 దేశాలకు చెందిన పోటీదారులు ఎంపికైన ఈ ఫినాలేలో మిస్‌ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్‌ కామెరూన్‌ (సింగింగ్‌) రెండవ స్థానంలో, మిస్‌ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు. అద్భుతమైన పియానో సంగీతంతో మిస్‌ ఇండోనేషియా వేదికను సోల్‌ఫుల్‌ ఫీల్‌లో ముంచెత్తింది. శ్రావ్యమైన పాశ్చాత్య సంగీత వెల్లువతో ‘గుడ్‌నెస్‌ ఆఫ్‌ గాడ్‌’ పాట పాడి మిస్‌ కామెరూన్‌ ప్యానెలిస్టుల మనసు దోచుకుంది.

మిస్‌ ఇటలీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక విశిష్టతను కలిగిన బ్యాలేను ప్రదర్శించింది. ఇండియన్‌ కంటెస్టెంట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా చేసిన బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌ దోల్‌ భాజే సాంగ్‌ వేదికను దద్దరిల్లేలా చేసింది. భారతీయ సంస్కృతిని మిస్‌ వరల్డ్‌ వేదికపై ఘనంగా ప్రదర్శించడం సంతోషంగా ఉందని నందినీ గుప్తా తెలిపారు. చివరగా మొత్తం 24 మంది పోటీదారులు రాను బొంబాయికి రాను, అద్దాల మేడలున్నయే అంటూ తెలుగు పాటలకు స్టెప్పులేశారు. కాగా, అత్యవసర సమయాల్లో రోగులను కాపాడే సీసీఆర్‌ ఎలా చేయాలో వినూత్నంగా ప్రదర్శించి వేల్స్‌ కంటెస్టెంట్‌ తన వైద్య వృత్తి గొప్పదనాన్ని చాటారు.  

సింగరేణి స్టాల్స్‌లో సుందరీమణులు 
గురువారం సాయంత్రం శిల్పారామాన్ని సందర్శించిన అనంతరం మిస్‌వరల్డ్‌ పోటీదారులు పక్కనే ఉన్న ఇందిరా మహిళా శక్తి బజారును సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి స్వయం ఉత్పత్తిదారుల వస్తు విక్రయశాలను కూడా వారు తిలకించారు. వివిధ ప్రాంతాల నుంచి సింగరేణి సేవా సమితిలో శిక్షణ పొందిన మహిళలు తయారుచేసిన బ్యాగులు, చేతి పర్సులు, మగ్గం వర్క్‌ చేసిన దుస్తులను పరిశీలించి, ఇవి చక్కగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)