Breaking News

మైన‌ర్ల‌ డ్రైవింగ్‌.. బండి ఆర్సీ సస్పెండ్‌!

Published on Sat, 04/05/2025 - 17:22

సాక్షి, హైద‌రాబాద్‌: పద్నాలుగేళ్ల పిల్లాడు పాఠశాలకు ద్విచక్ర వాహనంపై వస్తుంటాడు.. పదహారేళ్ల కుర్రాడు జూనియర్‌ కాలేజీకి స్పోర్ట్స్‌ బైక్‌ తెస్తాడు.. పదిహేడేళ్ల యువకుడు కళాశాలకు హైస్పీడ్‌ (High Speed) వాహనం లేదా కారులో రాకపోకలు సాగిస్తాడు.. నగరంలో నిత్యం కనిపించే దృశ్యాలివి. ఇలాంటి మైనర్లు నగరంలో అనేక మంది అమాయకులను బలి తీసుకోవడంతో పాటు వాళ్లూ ప్రాణాలు కోల్పోతున్నారు. 

మైనర్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండదని, వాళ్లు వాహనం నడుపకూడదని తల్లిదండ్రులు, కుటుంబీకులు సహా అందరికీ తెలుసు. అయితే ఎవరూ పక్కాగా పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితులన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్‌ చేస్తూ మైనర్లు చిక్కితే ఆ వాహనం రిజిస్ట్రేష‌న్‌ను రద్దు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్‌ డ్రైవ్‌ శనివారం నుంచి ప్రారంభమవుతుందని శుక్రవారం ఆయన ప్రకటించారు.  

కఠిన చట్టాలు లేకపోవడం వల్లే.. 
ప్రస్తుతం అమలులో ఉన్న మోటారు వెహికిల్‌ యాక్ట్‌ (Motor Vehicles Act) ప్రకారం మైనర్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండే అవకాశం లేదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాదిరి ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్లు వాహనాలపై విజృంభిస్తున్నారు. అక్కడ మైనర్లు డ్రైవింగ్‌ చేస్తూ వస్తే వారితో పాటు తల్లిదండ్రులకూ జరిమానా విధిస్తారు. ఆ జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం, మూడు ఉల్లంఘనలకు మించితే తల్లిదండ్రుల లైసెన్స్‌ పూర్తిగా రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయి. 

ఇక్కడ అంతటి కఠిన చట్టాలు లేకపోయినా.. ఇప్పటి వరకు అధికారులు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్‌ 180 ప్రకారం ఓ మైనర్‌ కానీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ (Driving License) లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధిస్తున్నారు.  
    

ఇక నుంచి ఆ చట్టంలోని 199 (ఎ) సెక్షన్‌ను వినియోగించాలని జోయల్‌ డెవిస్‌ (Joel Davis) నిర్ణయించారు. ఈ సెక్షన్‌ ప్రకారం వాహనం నడుపుతూ చిక్కిన మైనర్‌కు జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ వాహనం రిజిస్ట్రేష‌న్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ) ఏడాది పాటు సస్పెండ్‌ అవుతుంది. సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తి మొదట లెర్నింగ్‌ లైసెన్స్, ఆపై శాశ్వత లైసెన్స్‌ తీసుకోవచ్చు. 

అయితే డ్రైవింగ్‌ చేస్తూ చిక్కిన మైనర్‌కు మాత్రం 25 ఏళ్ల నిండే వరకు ఈ రెండింటిలో ఏదీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని జోయల్‌ డెవిస్‌ కోరుతున్నారు. ప్రజలు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరిస్తూ రోడ్డు ప్రమాదాలు, అందులో మృతుల్ని తగ్గించడంతో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

చ‌ద‌వండి: ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వ‌స్తారో తెలియ‌దు!  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)