Breaking News

తెరుచుకున్న సాగర్‌ గేట్లు.. క్రస్ట్‌ గేట్లు ఎత్తిన మంత్రులు

Published on Tue, 07/29/2025 - 11:49

సాక్షి, నల్గొండ జిల్లా: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇవాళ ఉదయం (మంగళవారం) మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నాగార్జునసాగర్‌ గేట్లను పైఎత్తి వరద నీటిని విడుదల చేశారు.

కాగా, సోమవారం శ్రీశైలం జలాశయానికి మొత్తం 2,31,612 క్యూసెక్కుల వరద వస్తుండగా రాత్రి 10 గంటలకు ఐదు గేట్లను ఒక్కోటీ 10 అడుగుల మేర పైకెత్తి మొత్తం 2,01,229 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.8 అడుగుల వద్ద 203.4290 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు సాగర్‌ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 584.41 అడుగులకు చేరుకుంది.

అలాగే గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 295.7 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా 28,785 క్యూసెక్కులను తెలంగాణ దిగువకు విడుదల చేస్తుండగా.. కుడి ప్రధాన కాల్వ ద్వారా 5,394 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటోంది. ఎడమ ప్రధాన కాల్వ ద్వారా రెండు రాష్ట్రాల అవసరాలకు మరో 6,634 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)