Breaking News

‘ఎల్‌ నినోను ఎదుర్కొంటాం’

Published on Mon, 07/20/2026 - 22:10

సాక్షి,హైదరాబాద్‌: ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లోని ఉద్యాదిత్య భవన్ లో నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో ఎల్ నినో సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంపై సోమవారం (జూలై 20) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నీటి లభ్యతను బట్టి రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లాకు సాగునీరు అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ఈ సొరంగం పనులను వేగవంతం చేయడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకుంటామని మంత్రులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)