Breaking News

మీ అభిప్రాయం ఏంటి?

Published on Mon, 08/25/2025 - 05:48

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్‌ పార్టీ నియమించిన మంత్రుల కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఆదివారం ప్రజాభవన్‌లో కమిటీ సమావేశమై రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయం తీసుకుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,    


శ్రీధర్‌బాబులు హాజరయ్యారు. కరీంనగర్‌ పర్యటనలో ఉన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫోన్‌లో కమిటీతో తన అభిప్రాయాన్ని పంచుకోగా, ఇంకో మంత్రి సీతక్క గైర్హాజరయ్యారు. సమావేశంలో భాగంగా కులగణన నుంచి బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపేంతవరకు జరిగిన కార్యాచరణ, న్యాయపరంగా ఈ బిల్లు ఆమోదానికి తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి ఎన్నికలకు వెళితే.. ఎదురయ్యే అడ్డంకులు తదితర అంశాలపై ఏజీ సుదర్శన్‌రెడ్డితో కమిటీ చర్చించింది. 

ఆయన అభిప్రాయాలను విన్న కమిటీ సోమవారం కులగణనపై నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డితోపాటు అభిషేక్‌ మనుసింఘ్వి తదితర ఢిల్లీలోని న్యాయ కోవిదుల అభిప్రాయాలను కూడా తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఈనెల 26వ తేదీకల్లా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నివేదిక అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వైఖరిని కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. ఆ తర్వాత ఈనెల 29న జరిగే కేబినెట్‌ భేటీలో ప్రభుత్వ నిర్ణయం వెల్లడి కానుంది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)