మిల్లర్లు మింగిన ధాన్యం విలువ రూ. 6,630.74 కోట్లు

Published on Wed, 08/05/2026 - 01:46

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటైన 2014 నుంచి 2025 వరకు రాష్ట్రంలోని మిల్లర్లు ప్రభుత్వానికి కస్టమ్‌ మిల్లింగ్‌ ద్వారా అప్పగించాల్సిన రూ.13,399.71 కోట్ల విలువైన 59.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాయం చేశారు. పౌరసరఫరాల శాఖ నయానో, భయానో హెచ్చరికలతో ఇందులో నుంచి 31.73 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని, లేదా దానికి సమానమైన మొత్తం విలువ రూ.6,768.97 కోట్లు రికవరీ చేసింది. అయినా ఇంకా మిల్లర్ల నుంచి రూ.6,630.74 కోట్ల విలువైన 28.22 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇందులో 2022–23 రబీకి సంబంధించి 15.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇప్పటికీ రికవరీ కాలేదు. దాని విలువ ఏకంగా రూ.3,572 కోట్లు. ఇదే సీజన్‌లో ఏకంగా రూ.8,069 కోట్ల విలువైన 38 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాయం చేస్తే, ప్రభుత్వం రికవరీ సంస్థలను పెట్టి మరీ రూ.4,497 కోట్ల విలువైన 22.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం లేదా దానికి సమానమైన నగదును రికవరీ చేసింది. తాజాగా గత ఖరీఫ్‌లో అప్పగించిన సన్నధాన్యం నుంచి కూడా సుమారు రూ.500 కోట్ల విలువైన ధాన్యం మాయం చేయగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల ద్వారా రూ.250 కోట్ల మేర రికవరీ చేశారు.  

రికవరీ లోటుపై మంత్రి ఆగ్రహం 
మంగళవారం సచివాలయంలో మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2014 నుంచి ఇప్పటి వరకు మిల్లర్లు దోచేసిన రూ.వేలకోట్ల విలువైన ధాన్యం, సీఎంఆర్‌లపై సమీక్షించారు. కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ డీఎస్‌.చౌహాన్, పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌తో పాటు ఇతర ముఖ్యమైన అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ రూ.వేలకోట్ల విలువైన ధాన్యం గల్లంతు కావడం, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ దారి మళ్లడంపై తీవ్రంగా స్పందించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో ఏ సీజన్‌లో ఎంత మొత్తం ధాన్యాన్ని మిల్లర్లు మాయం చేస్తే, ప్రభుత్వం ఎంత మేర రికవరీ చేసిందో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రి అధికారులకు వివరించారు. 

మిల్లర్లు మాయం చేసిన ధాన్యంలో సగానికి పైగా రికవరీ చేయించినప్పటికీ, మిగతా మొత్తాన్ని ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ధాన్యాన్ని దారి మళ్లించే, కస్టమ్‌ మిల్లింగ్‌ ఒప్పందాలను ఉల్లంఘించే రైస్‌ మిల్లర్లపై విజిలెన్స్‌ దాడులు మరింత ముమ్మరం చేస్తామని, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు బ్లాక్‌లిస్టింగ్‌ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ హెచ్చరించారు. డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన పరిమిత గడువు వల్ల ఇప్పటికే గణనీయమైన రికవరీలు జరిగాయని అధికారులు వివరించగా, మిగిలిన ప్రతి కేసును మిల్లర్‌ వారీగా సమీక్షించి గడువు నిర్ధారిస్తూ ప్రత్యేక రికవరీ కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు.    

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)