Breaking News

క్రైస్తవులు ఏకతాటిపైకి రావాలి 

Published on Wed, 02/01/2023 - 01:50

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే.. కొన్ని వర్గాల వారు చర్చిలు, మసీదులు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. కానీ, రాష్ట్రంలో వారి పప్పులు ఉడకవని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అటువంటి వారిని ఉపేక్షించరన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవులంతా ఒకేతాటిపైకి వచ్చి వారి హక్కులు, సంక్షేమ పథకాలు సాధించుకునేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.

మంగళవారం నారాయణగూడలోని బాప్టిస్టు చర్చిలో ‘తెలంగాణ యునైటెడ్‌ క్రిస్టియన్స్‌ అండ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌’(టీయూసీపీఏ) ఆధ్వర్యంలో 33 జిల్లాల పాస్టర్‌ల సమావేశం జరిగింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలసి మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. క్రైస్తవుల్లో ఐకమత్యం లోపిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ వరకు ప్రతి మండలానికి ఓ కమిటీని రూపొందించి ఈ కమిటీలన్నీ ఒకే గొడుగు కింద ఉండేలా కృషి చేయాలన్నారు.

అందరూ ఏకతాటిపైకి వస్తే దక్కాల్సిన హక్కులు తప్పకుండా దక్కుతాయన్నారు. మైనార్టీలు అంటే క్రైస్తవులు కాదనే ఆలోచన నుంచి క్రైస్తవులు బయటకు రావాలని సూచించారు. క్రైస్తవుల కోసం షాదీముబారక్‌ పేరుమార్పు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. లోపాలను సరిదిద్దుకుని ముందుకువచ్చి హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, అందరూ ఏకతాటిపైకి వచ్చి నిలబడితే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని ప్రకటించారు. రాష్ట్రంలో కోటిన్నర జనాభా కలిగిన క్రైస్తవులు డెసిషన్‌ మేకర్స్‌ అని ఎమ్మెల్యే దానం అన్నారు. కొంతకాలంగా కొన్ని వర్గాలపై ప్రణాళిక ప్రకారం దాడులు జరుగుతున్నాయని.. దానిని అధిగమించేందుకు క్రైస్తవులు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు