Breaking News

మంథనిలో స్కిల్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం

Published on Sun, 09/15/2024 - 06:05

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో త్వరలో స్కిల్స్‌ సెంటర్‌ను స్థాపించి విద్యార్థులకు వివిధ రంగాల్లో అవసరమైన శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం ఆయన పట్టణంలో సెంటెలియన్‌ నెట్‌వర్క్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బ్రాంచ్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత్, అమెరికా, ఆ్రస్టేలియాతోపాటు మరో ఆరు దేశాల్లో వెయ్యి మంది ఉద్యోగులతో నడిచే ఈ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ డైరెక్టర్లు రాధాకిశోర్, వెంకట్‌ తనకు మంచి మిత్రులన్నారు.

మంత్రిగా తాను ప్రమాణ స్వీకా రం చేసిన సందర్భంగా వారు అభినందించడానికి వచ్చారని, ఆ సమయంలో ఈ ప్రాంతానికి ఉపయోగపడేలా కంపెనీ బ్రాంచ్‌ను మంథనిలో ఏర్పాటు చేయాలని, అప్పుడే తనకు నిజమైన గౌరవం దక్కుతుందని సూచించానన్నారు. ఇక్కడ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యాలయం ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యాలయానికి అవసరమైన సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్‌ రాధాకిశోర్, మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండ్రు రమ, వైస్‌ చైర్మన్‌ సీపతి బానయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)