Breaking News

‘సీతక్క పారిపోయే రకం కాదు’

Published on Sun, 02/01/2026 - 20:50

మేడారం(ములుగు జిల్లా): మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో మా ఆదివాసీల అస్తిత్వం కోసం పరితపించే ఆదివాసి బిడ్డనని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తాను పారిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాల చేశాయని, సీతక్క పారిపోయే రకం కాదన్నారు. భక్తులు, ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకం తానన్నారు. మేడారంలో  మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ‘తనువెల్ల ఆదివాసి అస్తిత్వాన్ని, నిలువెల్లా ఆత్మగౌరవాన్ని, తల్లుల పట్ల భక్తిని కలిగి ఉన్న వ్యక్తిని నేను. మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక  కొందరు చేసే కుట్రలకు భయపడే రకం కాదు

జాతరను విజయవంతం చేసిన విధంగానే జాతర తర్వాత చేపట్టాల్సిన పనులను పూర్తి చేస్తున్నాం. ఐదువేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బంది నియమించి మేడారాన్నీ పరిశుభ్రపరుస్తున్నాము. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు. విఐపిల తాకిడి వల్ల ట్రాఫిక్ జామ్ అయింది

ఆ ట్రాఫిక్ జామ్ లో ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి. గట్టమ దేవాలయం వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకున్నాము. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత సమ్మక్కకు రావటం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నివారించాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ దఫా నివారించగలిగాము. భక్తితో బాధ్యతతో  సంయమనంతో దైవ దర్శనానికి రండి అని భక్తులకు మేము చేసిన విజ్ఞప్తి పనిచేసింది

బ్రహ్మాండంగా జాతరను నిర్వహించుకున్నాము. అందరికీ అభినందనలు. సమ్మక్క సారలమ్మతో మాకు భావోద్వేగా బంధం ఉంది అందుకే అన్ని జాగ్రత్తలు చేపట్టాము. గుడి నిర్మాణ బాధ్యతలను నెత్తికెత్తుకున్నాము. గుడి నిర్మాణం జాతరకు ముందే పూర్తయింది. గతంలో జాతరకు ముందు రోజుకు ఒకటి రెండు లక్షల మంది భక్తులే వచ్చేవారు. కానీ కొత్త గుడి నిర్మాణం తర్వాత ఓకే రోజూ 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారు. గతంలో తాత్కాలికంగా పనులు జరిగేవి కానీ ఈ దఫా శాశ్వత పద్ధతిలో పనులు పూర్తి చేయడం వల్ల భక్తులు విపరీతంగా తరలివచ్చారు. త్రాగునీరు టాయిలెట్స్ ముందస్తుగానే సిద్ధం చేశాం. సమ్మక్కను సకాలంలో గద్దెల మీదకు తీసుకురావడంలో పూజారులు సహకరించారు.. వారికి ధన్యవాదాలు. కొంతమంది కొత్త పోలీస్ సిబ్బంది పూజారులను గుర్తించకపోవడం వల్ల పొరపాటు జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బందులకు గురిచేయలేదు’ అని పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌