Breaking News

మహిళా ఐఏఎస్‌ ఎపిసోడ్‌.. మంత్రి సీతక్క సీరియస్‌

Published on Sat, 01/10/2026 - 19:59

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులపై అసభ్య, అనుచిత ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రి సీతక్క తాజాగా మాట్లాడుతూ..‘మహిళా అధికారుల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్‌లను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం. మహిళలు ఉన్నత స్థాయికి చేరితే తట్టుకోలేని ఫ్యూడల్ మానసిక స్థితే.. దుష్ప్రచారాలకు కారణం. మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రచారాన్ని సహించబోము. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

మహిళా ఐఏఎస్ అధికారులు ధైర్యంగా, నిబద్ధతతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహిళా అధికారుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుంది. అసభ్య వ్యాఖ్యలు, దూషణలు చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి. మహిళలపై ద్వేషపూరిత ప్రచారానికి సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలవాలి. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)