Breaking News

పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్‌

Published on Mon, 12/23/2024 - 15:18

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప సినిమా విషయంలో రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, తాజాగా పుష్ప సినిమాపై మంత్రి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్మగ్లర్ సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలో ‍స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్‌ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. జైభీమ్‌ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇదిలా ఉండగా పుష్ప-2 సినిమా రిలీజ్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్‌ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్‌ మీద బయటకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్‌ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది. దీంతో, ఈ వ్యవహరంలో రోజుకో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. 

పుష్ప-2 మూవీపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి సీతక్క
 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)