Breaking News

కర్నూలు బస్సు ప్రమాదం.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 10/24/2025 - 11:20

సాక్షి, హైదరాబాద్‌: కర్నూలులో చోటుచేసుకున్న కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులపై ప్రతీరోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపడితే వేధింపులు అంటున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని వ్యాఖ్యలు చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం.

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తాం. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాద్‌ నుండి బెంగళూరు తిరుగుతుంది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం’ అని చెప్పుకొచ్చారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)