Breaking News

ప్రయాణికుల కోసం TGSRTC మీ టికెట్ యాప్

Published on Tue, 02/24/2026 - 20:02


సాక్షి హైదరాబాద్‌:TGSRTC ప్రయాణికుల మరింత సౌకర్యవంతమైన సేవల కోసం "మీ సేవ మీ టికెట్" పేరుతో నూతన మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఈ రోజు మంగళవారం  సచివాలయంలో రవాణా శాఖ మంత్రి శ్రీ  పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ  వికాస్ రాజ్,  తెలంగాణ ఆర్టీసీ వీసీ & ఎండీ  వై.నాగిరెడ్డి , మీసేవ కమీషనర్  శ్రీ రవికిరణ్ తో పాటు ఇతర అధికారులతో కలిసి  మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.

ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ OPRS సేవలను కూడా అనుసంధానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు సుదూర ప్రయాణాలకు, ఇంటర్‌సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. యాప్ ద్వారా మెుత్తం 1,710 ఓపీఆర్ఎస్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు ఐదు కేటగిరీల సిటీ బస్ పాస్‌లు డిజిటల్‌గా అందుబాటులో ఉండనున్నాయన్నారు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ జంట నగరాల పరిధిలో కార్యకలాపాల కోసం T24 టికెట్‌ను కూడా మీటికెట్  మొబైల్ యాప్‌లోనే పొందవచ్చని తెలిపారు.  

 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)