Breaking News

‘ఇంటిగ్రేటెడ్‌’లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య

Published on Sat, 10/12/2024 - 04:17

ఖమ్మం రూరల్‌: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను నిర్మిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం పొన్నేకల్‌ సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాల నిర్మాణ పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 28 పాఠశాలలకు శంకుస్థాపన చేయగా.. పాలేరు నియోజకవర్గానికి స్థానం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 3 వేల మంది పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో శిక్షణ ఉంటుందన్నారు. పది వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల నిర్మాణమే.. విద్యారంగంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని పొంగులేటి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పెండింగ్‌లో పెట్టిన 22 వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతులు, 34 వేల మంది బదిలీలను వివాదాలకు తావు లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముజుమ్మిల్‌ ఖాన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)