Breaking News

అయోవా–తెలంగాణ మధ్య పరస్పర సహకారం 

Published on Wed, 08/30/2023 - 01:41

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని అయోవా రాష్ట్రం – తెలంగాణ మధ్య పరస్పర సహకారం ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్‌ లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆడమ్‌ గ్రెగ్‌తో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయక రాష్ట్రంగా పేరుగాంచిన అయోవాకు, తెలంగాణకు అనేక సారూప్యతలున్నాయన్నారు.

రెండు రాష్ట్రాలూ ఆహారధాన్యాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసోత్పత్తిలో నంబర్‌ వన్‌గా నిలిచాయని, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని చెప్పారు. పలు విధాన నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందన్నారు. తెలంగాణ సాధించిన విజయాలు గర్వించదగ్గవని ఆడమ్‌ కితాబిచ్చారు.   

తెలంగాణలో ఐదు విప్లవాలు 
అనంతరం నిరంజన్‌రెడ్డి అయోవా సెక్రటరీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ మైక్‌ నెయిగ్‌ను కలిశారు. రాష్ట్రంలో రెండో హరిత విప్లవం ద్వారా ధాన్యం ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందని, పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా శ్వేత విప్లవం, చేపల పెంపకంలో వృద్ధి సాధించి నీలి విప్లవం సాధించామని చెప్పారు. అలాగే, మాంసోత్పత్తిలో రికార్డు సృష్టించి పింక్‌ రెవల్యూషన్‌ సాధించిన తెలంగాణ, ఇప్పుడు నూనె గింజల ఉత్పత్తిలో పసుపు విప్లవాన్ని సాధించే దిశగా పురోగమిస్తోందని వివరించారు.

తెలంగాణ సాధించిన అయిదు విప్లవాల గురించి విన్న మైక్‌ నెయిగ్‌ త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శించి ఈ విజయాలను స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారన్నారు.  అలాగే ప్రపంచంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ వర్సిటీ అయిన అయోవా స్టేట్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ను మంత్రి సందర్శించారు. వర్సిటీ ప్రెసిడెంట్‌ వెండీ వింటర్‌స్టీన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

అయోవా వర్సిటీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాల మధ్య స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్సే్ఛంజ్‌ ప్రోగ్రాం ఉండాలనే చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)