మిర్చి రైతులు నష్టపోవద్దు

Published on Wed, 02/21/2024 - 04:38

సాక్షి, హైదరాబాద్‌: మిర్చి పంట భారీ ఎత్తున మార్కెట్‌లోకి వస్తోందనీ, ధర విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మార్కెటింగ్‌ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు.

రాష్ట్రంలో 3.91 లక్షల ఎకరాలలో మిర్చి సాగుచేయగా ఇప్పటికే 94395 మెట్రిక్‌ టన్నుల మిర్చి మార్కెట్‌కు వచ్చిందని వివరించారు. ఈ యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగు కాగా 1.92 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు.

ఇప్పటికే 93 వేల మెట్రిక్‌ టన్నులు అమ్మకానికి రాగా, స్వంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు నష్టపోయారని, ఈ పరిస్థితి రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిందని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: తుమ్మల 
జంగారెడ్డిగూడెం రూరల్‌ (ఏపీ): రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని రాష్ట్రాలూ కలిసికట్టుగా ముందుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులు నిర్వహిస్తున్న నిరసనలను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసు కుని అన్నదాతలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. స్వామినాథన్‌ కమిషన్‌ ఇచ్చిన రి పోర్టు ఆధారంగా ఖర్చులకు ఒకటిన్నర రెట్లు రైతు కు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)