Breaking News

సిద్దిపేటలో ఉత్సాహంగా హాఫ్‌ మారథాన్‌ 

Published on Mon, 08/07/2023 - 03:06

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో రంగనాయకసాగర్‌ వేదికగా ఆదివారం జరిగిన హాఫ్‌ మారథాన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన రన్నర్స్‌ ఉత్సాహంగా పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడు తూ ‘సిద్దిపేట అన్నింటిలో మేటి.. నేడు హాఫ్‌ మారథాన్‌లోనూ బెస్ట్‌గా నిలిచింది’అని అన్నారు. అనంతరం విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.

కాగా, దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్‌ రహిత హాఫ్‌ మారథాన్‌ను సిద్దిపేటలో నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా విభాగంలో సూర్యాపేటకు చెందిన ఉమ, పురుషుల విభాగంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన రమేశ్‌ చంద్ర ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. 10కే రన్‌ మహిళా విభాగంలో ప్రథమ బహుమతి నాగర్‌కర్నూల్‌కు చెందిన స్వప్న, పురుషుల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సునీల్‌కుమార్‌ సాధించారు.

కాగా, హైదరాబాద్‌ నుంచి 100 కిలోమీటర్లు రన్‌ చేసుకుంటూ వచ్చిన శ్రీకాంత్‌ను, అలాగే హైదరాబాద్‌ నుంచి సైక్లింగ్‌ చేసుకుంటూ వచ్చిన నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి డాక్టర్‌ నాగలక్ష్మిలను మంత్రి సత్కరించారు. 10 కిలోమీటర్ల పరుగులో వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి పాల్గొని 1.06 గంటల్లో పూర్తి చేశారు. హాఫ్‌ మారథాన్‌ (21.1కిలోమీటర్లు)లో 400 మంది, పది కిలోమీటర్ల రన్‌లో 550, 5 కిలోమీటర్ల రన్‌లో 4వేల మంది పాలుపంచుకున్నారు. సిద్దిపేట సీపీ శ్వేత, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ పాల్గొన్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)