Breaking News

తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి

Published on Fri, 02/14/2025 - 04:28

మాదాపూర్‌: వాణిజ్యం, వ్యాపారం లేకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు నడవలేవని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో గురువారం హైబిజ్‌ టీవీ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కీలక రంగాలలో అమూల్యమైన సేవలు అందించిన వారికి అవార్డులను అందజేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏడాదికాలంలో ప్రభుత్వం వ్యాపారరంగ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని తెలిపారు. 

2023లో తెలంగాణ అభివృద్ధి 2ఎక్స్‌గా ఉందని, రాబోయే నాలుగు సంవత్సరాలలో దాన్ని 10ఎక్స్‌కు చేరుస్తామన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. 

పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 11 మందికి లెజెండ్‌ పురస్కారాలను అందజేశారు. సీఎస్‌ఆర్‌ కేటగిరీలలో ఉత్తమ గ్రూప్‌గా ఐటీసీకి అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సుచిరిండియా సీఈఓ డాక్టర్‌ లయన్‌ వై.కిరణ్, భారతీ సిమెంట్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి, హైబిజ్‌ టీవీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)