Breaking News

హైదరాబాద్‌ హోటళ్లలో కల్తీ.. మంత్రి వార్నింగ్‌

Published on Tue, 06/11/2024 - 15:59

సాక్షి, హైదరాబాద్‌: ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి.. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందించారు.

‘‘హైదరాబాద్ బిర్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నాం. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తాం’’ అని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.

కాగా, పురుగులు పట్టిన పిండి.. చింతపండు, బూజు పట్టిన క్యారెట్లు.. గడువు తీరిన సాస్‌.. కిచెన్లలో అపరిశుభ్రత.. ఇలా జిల్లా పరిధిలో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌ కోర్టుల్లో లభించే ఆహారం ప్రజారోగ్యానికి హానికరంగా మారింది. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నా మొక్కుబడిగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా సాచిపోయిన, బూజు పట్టిన ఆహార పదార్థాలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)