Breaking News

ఏబీఎన్‌ రాధాకృష్ణపై మంత్రి భట్టి ఫైర్‌

Published on Sat, 01/24/2026 - 12:31

సాక్షి, హైదరాబాద్‌: తమ ప్రభుత్వంపై తప్పుడు కథనాలు రాసిన ఎబీఎన్‌ రాధాకృష్ణపై తెలంగాణ‌ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వీకెండ్‌ స్టోరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి టెండర్ల విషయంలో అనేక అపోహలు సృష్టించారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే ఆ టెంటర్లు రద్దు చేశామన్నారు.

ఏబీఎన్‌ రాధాకృష్ణ తెలంగాణ ఆత్మ సింగరేణిపై కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. పెట్టుబడులు - కట్టుకథలు - విషపు రాతలతో రాధాకృష్ణ రేపిన తప్పుడు ప్రచారంతో మొదలయింది. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు రాతలు- విషపు రాతలు రాశారన్నారు. ఏ రాబందులు- గద్దలు- దోపిడీ దారుల ప్రయోజనాల కోసం కథనాలు వస్తున్నాయని ప్రశ్నించారు. తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాలన్నారు.

ప్రభుత్వంపై నిందలు మోపి రాష్ట్రానికి- సింగరేణికి నష్టం చేస్తున్నారని, రాధాకృష్ణ ఊహగాన కథనాలు రాశారన్నారు. కథనం రాగానే ఒకాయన లేఖ రాశారు! ఇంకోగాయన స్పందించారన్నారు. వరుస ఎపిసోడ్స్ వెనుక ఆంతర్యం ఏంటి? అని భట్టి ప్రశ్నించారు. సింగరేణి నుంచి ఏ నిర్ణయంపై మంత్రి వద్దకు ఫైల్స్ రావని, సింగరేణి స్వతంత్ర బాడీ అని, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుదన్నారు. కనీస ఇంగితజ్ఞానం లేకుండా కథనం రాశారని భట్టి పేర్కొన్నారు. దీనిపై హరీశ్‌రావు లేఖ రాయడం, కిషన్ రెడ్డి విచారణ మొదలు పెట్టడం మంచిదయ్యిందన్నారు. కిషన్ రెడ్డి విచారణను తాను స్వాగతిస్తున్నానన్నారు. కొందరి ప్రయోజనాల కోసం పని చేసే వాళ్ల అన్ని విషయాలు బయటకు రావాలని భట్టి అన్నారు. 

సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ తప్పనిసరి నిబంధన 2018లో కేంద్ర ప్రభుత్వమే పెట్టిందని, 2021లో సింగరేణి - కోల్ ఇండియా ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లెకముందే సైట్ విజిట్ తప్పనిసరి అంటూ టెండర్లు పిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాత పద్ధతి ప్రకారమే టెండర్లు పిలిచారు. ఎన్‌ఎండీసీ 2021లో సైట్ విజిట్ తప్పనిసరి అంటూ టెండర్లు పిలిచారని భట్టి తెలిపారు.

బిడ్డర్లు సైట్ విజిట్ చేయాలని నిబంధనలు ఉన్నాయి. హిందూస్తాన్ కాపర్స్ లిమిట్ ఆధ్వర్యంలో సైట్ విజిట్ తప్పనిసరి అంటూ టెండర్లు పిలిచారు. జీఐసీపీఎల్‌ సైట్ విజిట్ తప్పని అంటూ టెండర్లు పిలిచారు.గుజరాత్ లో సైట్ విజిట్ చేసినట్లు సర్టిఫికెట్ సబ్మిట్ చేసినట్లు సంతకాలు ఉన్నాయి. తమిళ నాడులో నవరత్న కంపెనీ సైట్ విజిట్ సర్టిఫికెట్ లతోనే టెండర్లు పిలిచారు. ఉత్తరాఖండ్‌లో సైనిక్ స్కూల్ టెండర్లలో సైట్ విజిట్ తప్పనిసరి చేస్తూ డిఫెన్సె శాఖ లేఖలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు.

ABN రాధాకృష్ణపై భట్టి ఫైర్‌

కేంద్ర ఆర్థిక శాఖ‌ ఆధ్వర్యంలో జరిగిన టెండర్లలో సైట్ విజిట్ తప్పనిసరి చేసిందని, మహారాష్ట్రలో డిపార్ట్మెంట్ ఎక‌నామిక్స్‌లో సైట్ విజిట్ తప్పనిసరి చేస్తూ టెండర్లు పిలిచారని, దీన‌ దయాళ్ పోర్ట్ లో సైట్ విజిట్ అథారిటీ టెండర్లు పిలిచారని భట్టి తెలిపారు. జమ్ముకశ్మీర్ లో అక్కడి ప్రభుత్వం సైట్ విజిట్ తప్పనిసరి చేస్తూ టెండర్లు పిలిచిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు