Breaking News

సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు

Published on Sat, 08/31/2024 - 06:12

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పని చేస్తున్న ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులకు త్వరలో కనీస వేతనాలను ఖరారు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడి కంటే తమిళనాడు, కర్ణాటకల్లో సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, త్వరలో తెలంగాణలో దేశంలోనే ఉత్తమమైన వేతనాలను సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్‌ ఫిజికల్‌ సెక్యూరిటీ సమ్మిట్‌–2024ను భట్టి విక్రమార్క ప్రారంభించారు.

హైదరాబాద్‌ పోలీసులు, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ (హెచ్‌సీఎస్సీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సమ్మిట్‌కు నగర కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్‌ఎం.భగవత్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్‌సింగ్‌ మాన్‌తో పాటు హెచ్‌సీఎస్సీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. డిçప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ..’’రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 3.5 లక్షల వరకు ఉండగా.. ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు 4 లక్షల మంది ఉన్నారు. అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్న ఈ రంగం యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఈ సమ్మిట్‌ చేసే సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.’’అని చెప్పారు. 

సెక్యూరిటీ ఏజెన్సీలు రిజి్రస్టేషన్‌ చేసుకోవాలి: సీపీ 
నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులకు ఇప్పటికీ తక్కువ జీతాలే ఇస్తున్నారు. రాష్ట్రంలో 1500 ఏజెన్సీలు ఉండగా... 500 మాత్రమే రిజి్రస్టేషన్‌ చేసుకున్నాయి. మిగిలినవీ రిజి్రస్టేషన్‌ చేసుకోవాలి’అని పేర్కొన్నారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఫస్ట్‌ రెస్పాండెంట్స్‌గా మారాలని అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్‌ ఎం.భగవత్‌ పిలుపునిచ్చారు. ‘పోలీసులు వచ్చే వరకు నేర స్థలిని పరిరక్షించాలి. 

చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి అంశాన్నీ గుర్తిస్తూ, సంబంధిత శాఖలు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రైవేట్‌ సెక్యూరిటీలకు సంబంధించిన పసేరా చట్టం కూడా అదే చెప్తోంది. సెక్యూరిటీ గార్డులు ఇలా రూపొందేలా ప్రతి ఏజెన్సీ వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పోలీసు విభాగం అప్పట్లో నక్సలైట్లతో ఇప్పుడు సైబర్‌ క్రిమినల్స్‌తో పోరాటం చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే సైకిల్‌ పెట్రోలింగ్‌ పోయి సైబర్‌ పెట్రోలింగ్‌ వచి్చంది’అని మహేశ్‌భగవత్‌ అభిప్రాయపడ్డారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)