Breaking News

GHMC మేయర్‌ Vs MIM ఎమ్మెల్సీ.. అధికారుల్లో టెన్షన్‌!

Published on Tue, 11/26/2024 - 21:36

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ వర్సెస్‌ ఎంఐఎం ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. చికెన్‌, మటన్‌ షాపులు విషయంలో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ప్రస్తుతం మేయర్‌ వర్సెస్‌ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్‌ఎంసీలో హాట్‌ టాఫిక్‌ అంశంగా మారింది.

వివరాల ప్రకారం..‘కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని నాన్‌వెజ్‌ విక్రయాలు జరుపుతూ చికెన్‌ మార్కెట్‌ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. భరించలేని దుర్వాసన, ఎలుకల సంచారం.. తక్షణమే చికెన్‌ మార్కెట్‌ను సీజ్‌ చేయండి’.. ఈ నెల 22న కోఠిలోని మోతీ మార్కెట్‌లో ఆకస్మిక పర్యటన సందర్భంగా మేయర్‌ అధికారులకు చేసిన ఆదేశాలివి.. మేయర్‌ ఆదేశాల మేరకు చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి సీజ్‌ చేసే ప్రయత్నం చేశారు.

మరోవైపు.. మేయర్‌ ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మిర్జా రహమత్‌ బేగ్‌ సీజ్‌ చేసిన చికెన్‌, మటన్‌ షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ మందలించారు. మేయర్‌ ఆదేశాలు డోంట్‌కేర్‌..ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్‌ చేసుకుంటామా? అంటూ ఎమ్మెల్సీ బేగ్‌ మేయర్‌ తనిఖీల తీరును ఎండగట్టారు.

దీంతో, మేయర్‌ వర్సెస్‌ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్‌ఎంసీలో హాట్‌ టాఫిక్‌ అంశంగా మారింది. మేయర్‌ తీరుపై ఎంఐఎం ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడి క్యాంటీన్‌ విషయంలోనూ మేయర్‌ తరచూ జోక్యం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ బేగ్‌ మేయర్‌ ఆదేశాలకు ధీటుగా నిలబడి విమర్శలు గుప్పిస్తుండడంపై అటు అధికారుల్లో, ఇటు కార్పొరేటర్లలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)