TG: మాగనూరులో మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌

Published on Tue, 11/26/2024 - 16:40

సాక్షి, నారాయణపేట: తెలంగాణలోని పలు పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఫుడ్‌ పాయిజన్‌ జరిగిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజాగా జరిగిన ఘటనలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.

వివరాల ప్రకారం.. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు. దీంతో​, వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో​ ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: మాగనూర్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటన..హెచ్‌ఎం సహా మరొకరిపై సస్పెన్షన్‌

ఇక, ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులు గడవకముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇది కూడా చదవండి: మళ్లీ పురుగుల అన్నమే!

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)