పది రూపాయలకే 45 కి.మీ. ప్రయాణం

Published on Thu, 03/12/2026 - 12:20

రామగుండం:  కాగజ్‌నగర్‌–బోధన మధ్య నడిచే మెయిన్‌లైన్‌ ఎలక్ట్రిక్‌ మల్లిపుల్‌ యూనిట్‌ (మెమూ) ప్యాసింజర్‌ రైలు ప్రయాణం అత్యంత చవకగా ఉంది. ప్లాట్‌ఫారమ్‌ టికెట్‌కు సమానమైన చార్జి రూ.10తోనే 45 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఇది పేదలకు ఎంతో సౌకర్యంగా ఉంది. సిర్‌పూర్‌టౌన్‌-కరీంనగర్‌(67771/67772), కరీంనగర్‌-బోధన్‌ (67773/ 67774)  మధ్య ఇది నిత్యం రాకపోకలు సాగిస్తోంది. 

రామగుండం కేంద్రంగా చార్జీలు ఇలా.. 
Ramagundam (RDM) రామగుండం – సిర్‌పూర్‌టౌన్‌ మధ్య.. పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిన్‌రోడ్డు వరకు 45 కి.మీ. దూరం ఉంది. ఈమధ్య ఎక్కడికి ప్రయాణం చేసినా టికెట్‌ చార్జీ రూ.పది మాత్రమే. ఆ తర్వాత ఆసిఫాబాద్‌రోడ్, కాగజ్‌నగర్‌ వరకు రూ.20, సిర్‌పూర్‌టౌన్‌ వరకు రూ.25 ఉంది. రామగుండం – సిర్‌పూర్‌టౌన్‌ మధ్య దూరం 91కి.మీ. ఉంటుంది. రామగుండం – బోధన్‌కు మధ్య రాఘవపురం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ వరకు రూ.10, కరీంనగర్‌కు రూ.15, గంగాధరకు రూ.20, జగిత్యాలకు రూ.25, కోరుట్ల, మెట్‌పల్లి వరకు రూ.30, ఆర్మూర్‌కు రూ.40, నిజామాబాద్, బోధన్‌ వరకు రూ.45 చార్జి ఉంది. రామగుండం – బోధన్‌ మధ్య దూరం 195 కి.మీ. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తే అధిక సమయం తీసుకోవడంతోపాటు చార్జీలు అత్యధికమే. సుమారు రూ.500 వరకు ఉంటుందిజ

ఇదీ చదవండి: ఇరాన్‌ యుద్ధం-ఎల్‌పీజీ సంక్షోభం, పరిస్థితి ఇదీ!
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)