Breaking News

వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..

Published on Tue, 05/28/2024 - 10:38

సాక్షి, హైదరాబాద్‌: పాలుతాగే పసికందులను అపహరించి, విమానాలు, రైళ్లలో రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసు­లు. ఫెర్టిలిటీ సెంటర్లు, ఆస్పత్రులు, క్లినిక్‌­లలో పనిచేసే ఫోర్త్‌క్లాస్‌ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకొని, దంపతుల సమా­చా­రం సేకరించి, మధ్యవర్తుల సహాయంతో ఐదేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. 

ఢిల్లీ, పుణే నగరాల్లో రోజుల శిశువు­లను ఎత్తుకొచ్చి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్క పసికందును రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల చొప్పున అమ్మేస్తు­న్నారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన 11 మంది మధ్యవర్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను మల్కాజ్‌­గిరి డీసీపీ పీవీ.పద్మజ, శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులతో కలిసి రాచ­కొండ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు.

» ఈనెల 22న పీర్జాదిగూడలో మూడు నెలల పాపను విక్రయిస్తుండగా మేడిప­ల్లి పోలీసులు స్థానిక ఆర్‌ఎంపీ శోభారా­ణితోపాటు స్వప్న, షేక్‌ సలీంలను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుల­ను విచారించగా వీరి తరహాలోనే ఏపీ, తెలంగాణకు చెందిన మరో 8 మంది మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసును రివర్స్‌ ఇన్వెస్టిగేషన్‌ చేశారు. 

అన్నోజిగూడకు చెందిన బండారి హరిహర చేతన్‌– బండారి పద్మ, కుషాయిగూడకు చెందిన యాట మమత, ఉప్పుగూడకు చెందిన ముధా­వత్‌ రాజు, విజయవాడకు చెందిన బల­గం సరోజ, ముధావత్‌ శారద, ముంతాజ్, జగన్నాథం అనురాధలను పట్టుకు­న్నారు.

»  ఈ మధ్యవర్తుల సహాయంతో ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంతానం లేని దంపతులకు పిల్లలను విక్ర­యిç­Ü్తున్నారు. ఐదేళ్లలో 60 మంది శిశు­వులను విక్రయించారు. తాజా కేసులో 16 మంది పిల్లలను విక్రయా­నికి పెట్ట­గా.. ఏడుగురిని ఏపీ, 9 మందిని తెలంగాణకు చెందిన దంపతులు కొనుగోలు చేశారు. మధ్యవర్తులను విచారించిన పోలీసులు 16 మంది చిన్నారులను కాపాడారు.

 శిశువిహార్‌కు తరలించారు. వీరిలో 12 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు­న్నారు. ప్రతి శిశువు అమ్మకంపై ఒక్క ఏజెంట్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం పొందేవారు. పరారీలో ఉన్న నిందితులు కిరణ్, ప్రీతి, కన్న­య్యల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో..: వాట్సాప్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాలలో పిల్లల ఫొటోలు పంపిస్తారు. శిశువుల రంగు, ముఖ కవలికలను బట్టి ఎంపిక చేసుకుంటారు. ఫలానా ముహూర్తానికి పిల్లాడు కావాలని చెబితే చాలు ఆ సమయానికే పిల్లాడిని తీసుకొచ్చి అప్పగిస్తారు. రోజుల వయస్సున శిశువులనే దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో అయితేనే తనకు పుట్టిన బిడ్డగా, పిల్లలకు కూడా వీరే సొంత తల్లిదండ్రులని భావిస్తారు.

పిల్లలకు దూరం చేయకండి 
పిల్లలను రెస్క్యూ హోంకు తరలిస్తుండగా అప్పటివరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు తమ పిల్లలను దూరం చేయొద్దంటూ రాచకొండ కమిషనరేట్‌ ముందు అడ్డుపడ్డారు. దీంతో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తల్లిదండ్రులను మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

ఓ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. పెళ్లై 12 ఏళ్లు అయినా పిల్లలు కలగలేదని, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి దిక్కుతోచని స్థితిలో రెండున్నర ఏళ్ల క్రితం ఆరు రోజుల పసికందును కొనుగోలు చేశామని రావులపాలెంకు చెందిన ఓ జంట తెలిపారు. 

రూ.3.5 లక్షలు ఖర్చు చేసి 21వ రోజును ఘనంగా చేశామన్నారు.  రూ.కోట్లాది ఆస్తిపాస్తులను వారసుడి పేరు మీద రాసేందుకూ సిద్ధమయ్యామని చెప్పారు. ఇలాంటి సమయంలో  పిల్లాడిని పోలీసులు తమ నుంచి దూరం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు.

	అమ్మకానికి చిన్నారులు బయటపడ్డ సంచలన నిజాలు


 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?