Breaking News

మరోసారి తెరపైకి ప్రీతి కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..

Published on Wed, 09/13/2023 - 08:14

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి మృతి కేసులో సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ విద్యార్థి ఎంఏ సైఫ్‌ అలీ వాదన వినాలని కాకతీయ మె డికల్‌ కాలేజీని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అతనిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

‘వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ధరావత్‌ ప్రీతి ఎండీ అనస్థీషియా విద్యార్ధినిగా 2022లో చేరింది. రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్‌ ఆమెను ర్యాగింగ్‌ చేస్తూ వేధింపులకు గురిచేశారు.  ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21న సైఫ్‌ తన స్నేహితులతో కలసి ప్రీతికి విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చారు. చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది. దీనికి కారకులైనవారిపై కఠినచర్యలు తీసుకోవాలి’అని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో భాగంగా సైఫ్‌ను అధికారులు అరెస్టు చే యడమే కాకుండా సస్పెండ్‌ చేశారు. అయితే తన వాదనలు కూడా వినకుండా సస్పెండ్‌ చేశారని సైఫ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  అధికారులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సస్పెన్షన్‌ కొట్టివేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నందా విచారణ చేపట్టారు. సైఫ్‌ వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.    

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)