Breaking News

మెడికల్‌ కౌన్సెలింగ్‌ మరింత ఆలస్యం

Published on Wed, 08/13/2025 - 05:49

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై చివరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, పలు సాంకేతిక కారణాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఇంకా రిజిస్ట్రేషన్ల దగ్గరే ఆగిపోయింది. 

మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) ఆల్‌ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లను పలుమార్లు మార్చడం, కాళోజీ హెల్త్‌ యూని­వర్సిటీ స్థానికత అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం వేచి చూస్తుండడంతో రాష్ట్ర కోటా అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. 

కౌన్సెలింగ్‌కు సన్నద్ధం
‘స్థానికత’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 33పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. కాళోజీ వర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని భావించినప్పటికీ.. తీర్పు రాకపోవడంతో షెడ్యూల్‌­ను ప్రకటించలేదు. 

కాగా, కాళోజీ వర్సిటీ 33 జీవో­కు అనుగుణంగా 9, 10వ తరగతులతోపాటు ఇంట­­ర్మీడియెట్‌ తెలంగాణలో చదివిన వారిని స్థాని­కులుగా పరిగణిస్తూ ఒక ర్యాంకర్ల జాబితా రూపొందించాలని నిర్ణయించింది. ఇంటర్మీడియెట్‌ ఇతర ప్రాంతాల్లో చదివిన విద్యార్థులను కూడా కలుపు­కొని మరో ర్యాంకర్ల జాబితా రూపొందించాలని భావిస్తోంది. 

ఎంసీసీ కౌన్సెలింగ్‌ సైతం ఆలస్యమే!
ఎంసీసీ ఆధ్వర్యంలో జరగాల్సిన ఆల్‌ ఇండియా కోటా (ఏఐక్యూ) మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌లో చాయిస్‌ ఫిల్లింగ్, లాకింగ్‌ ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తాయని తెలిసింది. వెబ్‌సైట్‌ స్తంభించడం, ఆప్షన్లను సబ్‌మిట్‌ చేసే సమయంలో లోపాలు రావడంతో ఇప్పటివరకు నాలుగుసార్లు షెడ్యూల్‌ను పొడిగించారు. జూలై 21 నుంచి 30 వరకు తొలి విడత కౌన్సెలింగ్‌ జరగాల్సి ఉండగా, పలు వాయిదాల తరువాత ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. 

కాగా, పీడబ్ల్యూడీ, ఎన్‌సీసీ కోటా విద్యార్థులకు బోనస్‌ మార్కులు కలిపే అంశంపై వర్సిటీ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి 79 మంది పీడబ్ల్యూడీ కోటాలో ఉండగా, వీరికి నిమ్స్, సరోజినీ దేవి ఆస్పత్రుల్లో సోమ, మంగళవారాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్‌సీసీ కేటగిరీలో 467 మంది ఉండగా, వీరికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్, బోనస్‌ మార్కులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాంకర్ల జాబితా తుది రూపు దాల్చిన తర్వాతే వెబ్‌ ఆప్షన్లు, సీటు కేటాయింపు షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు వర్సిటీ తెలిపింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)