Breaking News

నా అంతిమయాత్రకైనా దారివ్వండి

Published on Thu, 10/09/2025 - 12:02

 మెదక్‌: ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వకుండా మూసివేసినా, తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పురుగు మందు సేవించిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండల పరిధిలోని వాడి గ్రామానికి చెందిన బూర్గుపల్లి సుభాశ్‌రెడ్డి(44)  కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పాలివారు తన ఇంటి వద్దకు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా మూసివేశారు. దీంతో మండల, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈనెల 3న పురుగు మందు సేవించాడు. తాను మృతిచెందిన తర్వాత తన సమస్యను పరిష్కరించి, ఆ దారి వెంటే తన మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అధికారులకు విన్నవించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

గ్రామంలో ఉద్రిక్తత, భారీ బందోబస్తు 
సుభాశ్‌రెడ్డి మృతికి కారణమైన వారిని శిక్షించి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ బంధువులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతికి కారణమైన వారిని శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్‌ రూరల్‌ సీఐ జార్జ్, ఎస్‌ఐ నరేశ్‌ ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుభాశ్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లకుండా  అడ్డంగా ఉంచిన గేట్‌ను తొలగించారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని హామీ ఇచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించమబోమంటూ మొండికేశారు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు